: పవన్ కల్యాణ్ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం


జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో కరవు యాత్ర చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమయిందని విశ్వసనీయ సమాచారం. పవన్ పాదయాత్ర చేయనున్న మార్గాన్ని పరిశీలించేందుకు రెండు మూడు రోజుల్లో ఆ పార్టీ పరిశీలకులు అనంతపురం జిల్లాకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 2016 నవంబర్ 10న అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ బహిరంగసభను నిర్వహించారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ తొలి కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతానని ప్రకటించారు. 2019లో జరిగే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆయన అనంతపురం జిల్లాపై ఎక్కువ శ్రద్ధను కనబరుస్తున్నారు. జిల్లాలో పవన్ పాదయాత్ర కళ్యాణదుర్గం నుంచి ప్రారంభమై మడకశిర, పెనుకొండ, గోరంట్ల, పుట్టపర్తి, ధర్మవరం మీదుగా అనంతపురం వరకు కొనసాగుతుంది. అనంతపురంలో యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. 

  • Loading...

More Telugu News