: ఏడాది పాటు సస్పెండ్ చేసినా రోజాకు బుద్ధి రాలేదు!: విష్ణుకుమార్ రాజు
ఒక సంవత్సరం పాటు వైకాపా ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసినా ఆమెకు బుద్ధి వచ్చినట్టు లేదని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఆమె ఇంకా రన్నింగ్ కామెంట్రీ చేయడం ఆపలేదని, సభ్యులు మాట్లాడుతుంటే, వెనుక నుంచి కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఆమె తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. సభలో పుల్లారావు చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు జగన్ పేర్కొనాలని, లేకుంటే తాను చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటే సరిపోతుందని, ఈ విషయంలో జగన్ తన వైఖరిని సభ ముందు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రోజా తన సీటును వదిలి వేరొకరి సీటులో కూర్చున్నారని, ఆమె తిరిగి తన స్థానానికి వెళితే బాగుంటుందని చెప్పారు.