: మావోయిస్టు గ్రూపుల మధ్య కాల్పులు... ముగ్గురి మృతి


రెండు వేర్వేరు గ్రూపులకు చెందిన మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. జార్ఖండ్ లోని పలమావు జిల్లాలో ఈ కాల్పులు ఈ ఉదయం చోటు చేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, మహ్మద్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతా చువా గ్రామంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోలు మరణించారు. మృతుల్లో అజయ్ యాదవ్ అనే మావోయిస్టు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈయన తలపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో గాయపడ్డ మావోయిస్టును అధీనంలోకి తీసుకున్నామని... ఇతను రెబల్ గ్రూపునకు చెందిన వ్యక్తి అని పోలీసులు చెప్పారు. ఒక ఏకే 47ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

  • Loading...

More Telugu News