: ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమాపణలు చెప్పను : శివసేన ఎంపీ గైక్వాడ్


ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదు. తాను ఆ విధంగా చేయడం కరెక్టే అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఇంకా మాట్లాడితే, సదరు ఉద్యోగే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీలతో ఎలా ప్రవర్తించాలో అరవై సంవత్సరాలు ఉన్న ఆ ఉద్యోగికి తెలిసి ఉండాలని అన్నారు. ఈ విషయమై పోలీసులకు దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, తనకు పార్టీ అండగా ఉందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News