: రూ. 3,300 కోట్లకు 'ఈబే'ను సొంతం చేసుకోనున్న ఫ్లిప్ కార్ట్


ఆన్ లైన్ అమ్మకాల దిగ్గజం అమేజాన్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఫ్లిప్ కార్ట్ భారీ విస్తరణ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 500 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 3,300 కోట్లు) ఈబే భారత సబ్ సైడరీని సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో అభివృద్ధి, విస్తరణ లక్ష్యంగా తాము నిర్దేశించుకున్న 2 బిలియన్ డాలర్ల నిధుల నుంచి ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు ఫ్లిప్ కార్ట్ వర్గాలు వెల్లడించాయి. ఇరు సంస్థల విలీనం చర్చలు 21వ తేదీన సాగాయని వెల్లడించిన ఓ ఉన్నతోద్యోగి, ఇప్పటికే తాము చైనాకు చెందిన టెన్సెంట్, మైక్రోసాఫ్ట్ ల నుంచి బిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందామని తెలిపారు.

తనకు దేశంలోని అతిపెద్ద పోటీదారైన అమేజాన్ సంస్థ దూకుడుగా సాగుతున్న వేళ, తమ మార్కెట్ వాటాను సాధ్యమైనంతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఫ్లిప్ కార్ట్ అడుగులు వేస్తోంది. కాగా, 2005లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈబే, కస్టమర్ల అభిమానాన్ని చూరగొనడంలో మాత్రం, ఆ తరువాత వచ్చిన అమేజాన్, స్నాప్ డీల్, పే టీఎం, షాప్ క్లూస్ లతో పోలిస్తే వెనుకబడింది.

  • Loading...

More Telugu News