: ఆన్ లైన్ అమ్మకాల్లో ‘కాటమరాయుడు’ టీ-షర్ట్స్, ఆకుపచ్చ టవల్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఆయా థియేటర్ల వద్ద పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, పవన్ అభిమానుల్లో చాలా మంది.. కాటమరాయుడు చిత్రంలో పవన్ ధరించిన ఆకుపచ్చ రంగు టవల్ ను, ‘కాటమరాయుడు’ టీ-షర్టులను ధరించి కనపడ్డారు. అయితే, పవన్ అభిమానులకు ఆ టవల్స్, టీ-షర్ట్స్ ను ‘katamarayudustore.com’ అనే వెబ్ సైట్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. ‘కాటమరాయుడు’ టవల్ ధర రూ. 130, ‘కాటమరాయుడు’ టీ-షర్టు ధర రూ.270గా ఉంది. రెండు రోజుల క్రితమే మార్కెట్లోకి విడుదలైన వీటిని కొనుగోలు చేసేందుకు పవన్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.