: త్వరలో ఈ-పాస్ పోర్టులు రానున్నాయి!
త్వరలో ఈ-పాస్ పోర్టులు రానున్నారు. ఈ మేరకు సన్నాహాలను ప్రారంభించామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, పాస్ పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు ఉండేందుకుగాను చిప్ ఆధారిత ఈ-పాస్ పోర్టులను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా టెండర్లు పిలిచే బాధ్యతను నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ కు అప్పగించినట్లు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు, డిజిటల్ సంతకం ఆ చిప్ లో ఉంటాయని చెప్పారు.