: షారుక్ తో ఐశ్వర్య జత కడుతుందా?


షారుక్ ఖాన్ తో ఐశ్వర్యా రాయ్ మళ్లీ జత కడుతుందా? బాలీవుడ్ లో ఇప్పుడీ వార్తే చక్కర్లు కొడుతోంది. దర్శకురాలు ఫరాఖాన్ త్వరలో తెరకెక్కించబోతున్న చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్'. ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ చిత్రంలో షారుక్ కథానాయకుడు. ఆయన సరసన ఐష్ నటిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరూ చివరిసారిగా నటించింది సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన 'దేవదాస్'.

అనంతర కాలంలో ఐష్ పెళ్లి చేసుకోవడం, ఓ పాపకు జన్మనివ్వడం జరిగింది. తిరిగి ఐశ్వర్యా రాయ్ స్క్రీన్ పై షారుక్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని, చిత్రానికి సంబందించి స్క్రిప్టు కూడా వినే పనిలో ఉందని అంటున్నారు. ఇదే చిత్రంలో భర్త అభిషేక్ కూడా నటిస్తాడని తెలుస్తోంది.

దీనిపై దర్శకురాలు ఫరా మాట్లాడుతూ.. ఇంకా ఎవరినీ ఈ చిత్రానికి ఒప్పించలేదని, ప్రచారంలో వున్న వార్తలు ఆధారంలేనివని కొట్టి పారేసింది. ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోలు ఉన్నారని వారికి జతయ్యే ఇద్దరు హీరోయిన్ల కోసం వెతుకుతున్నట్లు వివరించింది.

  • Loading...

More Telugu News