: ఆరేళ్ల చిన్నారిని చంపి, తినేసిన చిరుత
గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన సంభవించింది. అభయారణ్యం నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చిరుతపులి ఆరేళ్ల బాలికను చంపి, మృత దేహాన్ని చాలావరకు తినేసింది. చోకీ గ్రామానికి చెందిన షర్మిల అనే ఈ బాలిక తెల్లవారుజామున బహిర్భూమి కోసం బయటకు వచ్చింది. దీంతో, ఆ ప్రాంతంలో ఉన్న చిరుత... ఆ చిన్నారిని 200 మీటర్ల దూరం లాక్కెళ్లి, చంపి తినేసింది. ఈ బాలిక తల్లిదండ్రులు దాహద్ జిల్లా నుంచి ఇక్కడకు వలస వచ్చి, ఓ గుడిసెలో ఉంటున్నారు. బాలిక అవశేష మృత దేహానికి అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం చేయించారు. అనంతరం ఆమె మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బాలికను చంపి తిన్న చిరుతను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది రెండు బోన్లను ఏర్పాటు చేశారు.