: మమతకు షాక్... 400 మంది టీఎంసీ నేతలు బీజేపీలోకి జంప్
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ కమిటీలు, స్థానిక సంఘాల నేతలు సహా 400 మంది త్రిపుర బీజేపీలోకి జంప్ చేశారు. వీరి ఫిరాయింపు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిలో 16 మంది టీఎంసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ త్రిపుర యూనిట్ మాజీ చైర్మన్ రతన్ చక్రవర్తి నేతృత్వంలో వీరంతా పార్టీ మారేందుకు సంసిద్ధత తెలుపగా, కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రాజెన్ గోహెయిన్, త్రిపుర బీజేపీ అధ్యక్షుడు బిప్ లాబ్ దేవ్ లు వీరికి స్వాగతం పలికారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక పార్టీ బీజేపీయేనని, అందువల్లే ఆ పార్టీలో చేరామని ఫిరాయింపు నేతలు వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించనుందని ఈ సందర్భంగా గోహెయిన్ తెలిపారు.