: ప్రతిరోజూ ఇదే తీరా?: ప్రతిపక్షంపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రివిలేజ్ అంశం, అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చ జరగనుంది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని, సభా ప్రయోజనాలను కాపాడాలని రవికుమార్ అన్నారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా, ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్ల కార్డులతో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.