: శ్రీరామ నవమి నుంచి భద్రాద్రిలో ప్రసాదంగా వడపప్పు, పానకం!
ఇకపై భద్రాచలంలో భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైదిక సిబ్బందితో ఆలయ ఈవో టి.రమేష్ బాబు చర్చించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించడంతో ఈ కొత్త సంప్రదాయానికి శ్రీరామ నవమి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 5న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం నిర్వహించి, అనంతరం భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్టు ఈవో తెలిపారు. శ్రీరామనవమి రోజున వీఐపీల దర్శనాన్ని ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు అనుమతించే యోచనలో ఉన్నామని, ఈ అంశాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిస్తామని చెప్పారు.