: ఏపీకి రూ. 584 కోట్లు, తెలంగాణకు రూ. 314 కోట్ల సాయమిచ్చిన మోదీ సర్కారు
జాతీయ విపత్తు సహాయక నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద ఆంధ్రప్రదేశ్ కు రూ. 584.21 కోట్లు, తెలంగాణకు రూ. 314.22 కోట్ల నిధిని మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి అధికారుల కమిటీ, నిధుల మంజూరుకు ఆమోదం పలికింది. రాష్ట్రాల్లో కరవు, ప్రకృతి విపత్తులు సంభవించిన వేళ, కేంద్ర ప్రభుత్వ బృందాలు పర్యటించి నివేదికలు ఇచ్చిన దరిమిలా మొత్తం పది రాష్ట్రాలకు రూ. 5,020.64 కోట్లను ఇస్తున్నట్టు వెల్లడించింది.
కాగా, గత సంవత్సరం గుంటూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. ఆపై కేంద్ర బృందాలు పర్యటించి నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో, వాటిని సమీక్షించిన కేంద్రం నిధులను ప్రకటించింది.