: జగన్ ముందు వాపోతున్న మిర్చి యార్డు రైతులు!


గుంటూరు మిర్చి యార్డులో రైతులతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. మిర్చి ధరలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్మితే కూలి ధర కూడా రావడం లేదని, కనీస మద్దతు ధర లేకుంటే తమ పరిస్థితి ఏంటంటూ వారు ప్రశ్నించారు. క్వింటాల్ కు మూడు వేల రూపాయలతో తమకు గిట్టుబాటు కాదని, పంటను రోడ్డుపై వేయడం తప్ప మరో మార్గం లేదని, దళారులందరూ కుమ్మక్కయ్యారని రైతులు వాపోయారు. ఎవరూ తమ గురించి పట్టించుకోవడం లేదని, మొత్తం నకిలీ విత్తనాలే ఇచ్చారని, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని పలు ప్రాంతాలకు చెందిన మిర్చి రైతులు జగన్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News