: తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
తెలంగాణలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న మహబూబ్ నగర్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, భద్రాచలం, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 38 డిగ్రీలు రికార్డ్ అయింది. రాత్రిపూట ఉష్ణోగ్రత కూడా 18 డిగ్రీల పైనే ఉండటంతో ప్రజలకు ఉక్కపోత తప్పడం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఇంకా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.