: కొత్త టీవీ ఛానెల్ పెట్టనున్న పవన్ కల్యాణ్?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ తన గళాన్ని ప్రజలకు వినిపించేందుకు కొత్త టీవీ ఛానెల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెళ్లకు చెందిన ఇద్దరు అధినేతలతో కలిసి ఈ ఛానల్ ను ఆయన ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఈ రెండు ఛానెళ్ల అధినేతలు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ కు మీడియా భాగస్వాములుగా మాత్రమే వారు హాజరయ్యారని కొంత మంది అంటున్నప్పటికీ, అంతకుముందు, ఈ ఇద్దరు అధినేతలు పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. కొత్త టీవీ ఛానెల్ ఏర్పాటు విషయమై పవన్ ని వారు కలిశారనే వార్తలు హల్ చల్ చేస్తుండటం గమనార్హం.