: యూపీ ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ మంత్రుల ఫొటోలను తొలగించాలని ఆదేశం!
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ మంత్రుల ఫొటోలను తొలగించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మొహ్ సిస్ రజా ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఆఫీసు గదులు, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో, లేదో చూశారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, మాజీ మంత్రి ఆజాం ఖాన్ ఫొటోలు ఉండటాన్ని మొహ్ సిస్ రజా గమనించారు. వెంటనే, ఆ ఫొటోలను తొలగించాలని ఆయన ఆదేశించారు.