: పీవోకే, గిల్గిత్‌, బాల్తిస్థాన్ నుంచి పాక్‌ వెళ్లిపోవాలి: భారత్‌


కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాక్‌ సిద్ధమని, కశ్మీర్‌ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని భారత్‌లోని పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్‌ బాసిత్ ఈ రోజు పాకిస్థాన్ నేష‌న‌ల్ డే సంద‌ర్భంగా న్యూఢిల్లీలో ప‌లు వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిస్తూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు.

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌, గిల్గిత్‌ బాల్తిస్థాన్ నుంచి పాక్‌ వెళ్లిపోవాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల‌ను తిరిగి భార‌త్‌లో క‌ల‌పాల‌ని అన్నారు. ఇరు దేశాల మ‌ధ్య‌ ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు ఇదే కారణమని అన్నారు. పాకిస్థాన్‌ అక్రమించిన భూభాగాల‌కి తిరిగి ఎలా స్వాతంత్ర్యం ఇప్పించాలన్నదే ఇప్పుడు ముఖ్య‌మైన అంశ‌మ‌ని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News