: ఒకప్పుడు నేను మద్యానికి బానిసను!: పూజాభట్
ఒకప్పుడు తాను మద్యానికి బానిసనని, గత ఏడాది క్రిస్ మస్ రోజున ఈ అలవాటుకు స్వస్తి చెప్పానని బాలీవుడ్ ప్రముఖ నటి పూజాభట్ చెప్పింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మద్యపానంను ఓ సమస్యగా గుర్తించడం వల్లే తాను దాని నుంచి బయటపడగలిగానని తెలిపింది. అయితే, ఆ అలవాటు నుంచి బయట పడటం అంత తేలిక కాదని, కృతనిశ్చయంతో ఉంటేగానీ సాధ్యపడదని ఆమె చెప్పింది. మద్యం తాగే అలవాటు ఉన్న చాలా మంది మహిళలు, ఈ అలవాటు తమకు లేదని బుకాయిస్తుంటారని పూజాభట్ చెప్పుకొచ్చింది.