: భార్యపై అనుమానం.. ముగ్గురు పిల్లలతో పాటు భార్యను హత్య చేసిన కసాయి!
హరియాణాలోని షెహబజాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెతో పాటు తన బిడ్డలను కూడా చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతోనే నిందితుడు ఈ హత్యలు చేశాడని చెప్పారు. తన భార్యకు తన తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాధేశ్యామ్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లని, కొడుకును ఒక నీళ్ల ట్యాంకులోకి తోసేశాడని చెప్పారు.
అనంతరం ఆ ట్యాంకు బయట నుంచి మూత పెట్టేశాడని చెప్పారు. అనంతరం ఇంట్లోకి వచ్చిన రాధేశ్యామ్ ఇంట్లో వంట చేస్తున్న భార్య మంజు (33) ను పదునైన ఆయుధంతో మెడపై కోసి హత్యచేశాడని చెప్పారు. ఆ తర్వాత రాధేశ్యామ్ కూడా నూతిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడని, అయితే గమనించిన స్థానికులు అతడిని కాపాడారని చెప్పారు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు.