: మరింత వేగంగా 4జీ ఇంటర్నెట్ సేవలు.. రూ.1600 కోట్లతో ఎయిర్‌టెల్ డీల్!
భారత్‌లో 4జీ ఇంటర్నెట్ సర్వీసును మరింత వేగంగా అందించే క్రమంలో దేశీయ బ్రాడ్‌బాండ్ సేవల సంస్థ టికోనా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ డీల్ విలువను రూ.1600 కోట్లుగా పేర్కొంది. ఈ ఒప్పందంతో టికోనా బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రంతో పాటు మరో నాలుగు టెలికాం సర్కిల్స్‌లో 350 సైట్లు తమ సొంతం కానున్నట్టు తెలిపింది. రిలయన్స్ తో పాటు ఇతర సంస్థల నుంచి వస్తోన్న ఇంటర్నెట్ స్పీడ్ పోటీని తట్టుకునేందుకే ఎయిర్ టెల్ టికోనాతో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో ప్రవేశం ద్వారా స్వదేశీ ఒప్పందాలు, విదేశీ సంస్థల నిష్క్రమణలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.