: అలాంటి పనులకు దూరంగా ఉండండి.. అభివృద్ధికి పాటుపడండి: యూపీ ఎంపీలకు ప్రధాని హితబోధ
ఉత్తరప్రదేశ్ లో తమను గెలిపిస్తే ఉత్తమ ప్రదేశ్ గా తీర్చిదిద్దుతామనే హామీతో బీజేపీ అధికారం దక్కించుకున్నవిషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మరోమారు తమ పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ గుర్తు చేశారు. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి పాటుపడాలని మోదీ సూచించారు. తన అధికారిక నివాసంలోయూపీ ఎంపీలతో మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. ప్రభుత్వ అధికారులపై అజమాయిషి చేయడం, వారిని బదిలీలు చేయించడం, నియామకాల అంశాలపై దృష్టి పెట్టడం వంటి వాటికి ఎంపీలు దూరంగా ఉండాలని, కేవలం, అభివృద్ధిపైనే దృష్టి సారించాలని మోదీ సూచించినట్లు పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ ఎంపీ తెలిపారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యారు.