: కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాక్‌ సిద్ధం: పాకిస్థాన్ హై కమిషనర్‌ అనుచిత వ్యాఖ్యలు


న్యూఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ డే కార్యక్రమంలో పాల్గొన్న భారత్‌లోని పాకిస్థాన్ హై కమిషనర్‌ అబ్దుల్ బాసిత్ త‌న అక్క‌సు వెళ్లగ‌క్కారు. క‌శ్మీర్ అంశాన్ని లేవ‌నెత్తుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. కశ్మీర్ వాసుల ఆకాంక్ష‌ల‌ను ప్రతిబింబించేలా సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అన్నారు. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు పాక్‌ సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్య‌లు చేశారు. కశ్మీర్ వేర్పాటువాదులు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేన‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు, భ‌గ‌వంతుడి దయ వల్ల క‌శ్మీరీలు చేస్తోన్న పోరాట ఫ‌లితం త్వరలోనే వ‌స్తుంద‌ని అన్నారు.

బాసిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడ‌ద‌ని పేర్కొంది. భార‌త్ విష‌యాల్లో త‌ల దూర్చ‌డం కన్నా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంపై దృష్టిపెట్టాల‌ని హెచ్చ‌రించింది.

  • Loading...

More Telugu News