: రేపు లోక్ సభలో పసుపు బోర్డు ఏర్పాటు బిల్లు ప్రవేశ పెడతాం: ఎంపీ కవిత
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ రేపు లోక్ సభలో టర్మెరిక్ బోర్డు-2017 ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ లేఖలు రాశారని ఆమె చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందితే బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని, నిజామాబాద్ రైతు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ విషయమై ఇప్పటి వరకు రెండు సార్లు ప్రధాని మోదీని కలిశానని చెప్పారు.