: ఈజిప్ట్‌లో భారీ ఉగ్రదాడి.. 10 మంది సైనికుల మృతి, 15 మంది ఉగ్రవాదుల హతం


ప్ర‌తిరోజు ప్ర‌పంచంలోని ఏదో ఓ మూల దాడి చేస్తూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నారు. ఈ రోజు ఈజిప్ట్‌లో ఆర్మీ వాహ‌నాలే ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. ఉగ్ర‌వాదులు జ‌రిపిన‌ రెండు దాడుల్లో 10 మంది సైనికులు మృతి చెందారు. వెంట‌నే తేరుకున్న ఇత‌ర‌ సైనికులు ఉగ్రవాదుల‌పై ఎదురు కాల్పులు జ‌రిపి వారిని హ‌త‌మార్చారు.

ఉగ్ర‌దాడితో ప్రాణాలు కోల్పోయిన పదిమంది సైనికుల్లో ముగ్గురు అధికారులు ఉన్నారని అక్క‌డి అధికారులు తెలిపారు. సెంట్రల్ సినాయ్‌లో ఈ దాడులు జ‌రిగాయ‌ని చెప్పారు. ఈ దాడికి పాల్ప‌డ్డ మ‌రో ఏడుగురిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ అధికారం నుంచి దిగిపోయినప్ప‌టి నుంచి ఆ ప్రాంతంలో ఉగ్ర‌దాడులు పెరిగాయి.

  • Loading...

More Telugu News