: షూటింగ్ సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన తండ్రి హరికృష్ణ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ హైదరాబాదు శివారు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ ఈ రోజు కలిసి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సెట్స్ లో హరికృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఉన్న ఓ ఫొటోను ఆ సినిమా పీఆర్వో మహేష్ ఎస్ కోనేరు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒక పాత్ర పేరు ఎన్. లవ కుమార్ అని తెలిపారు. కాగా, ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.