: బ్రిటన్ పార్లమెంటు ఎదుట కాల్పుల ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు
నిన్న బ్రిటన్ పార్లమెంటు ఎదుట జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే లండన్ లో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా బలగాలు అక్కడి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, అడుగడుగునా తనిఖీలు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఆ దాడులకు సంబంధించి ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశామని చెప్పారు.
బ్రిటన్ పార్లమెంట్ దగ్గర దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం థేమ్స్ బ్రిడ్జ్‌పై కారుతో బీభత్సం సృష్టించిన ఘటనలో మరో 40 మందికి గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. లండన్‌తో పాటు బర్మింగ్‌హామ్ సిటీలో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి.