: ‘రెడ్ మీ 4ఎ’ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి!


ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ‘రెడ్ మీ 4ఎ’ను తాజాగా విడుదల చేసింది.  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ‘రెడ్ మీ 4ఎ’ను విక్రయానికి పెట్టిన తొలి సేల్ లోనే నిమిషాల వ్యవధిలో అన్ని ఫోన్లు అమ్ముడు పోయాయి. తొలి సేల్ లో ఈ ఫోన్ ను బుక్ చేసుకోలేకపోయిన వినియోగదారులు ఈ నెల 30న పెట్టనున్న ‘రెడ్ మీ 4ఎ’ రెండో సేల్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా, ‘రెడ్ మీ 4ఎ’ ప్రత్యేకతల విషయానికి వస్తే..
* 5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 13 ఎంపీ వెనుక, 5 ఎంపీ ముందు కెమెరా
* 3120 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకం.

  • Loading...

More Telugu News