: తొమ్మిది మంది సహోద్యోగులను కాల్చి చంపేసి.. తాలిబన్లలో చేరేందుకు వెళ్లిపోయిన పోలీసు అధికారి
ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉత్తర కుందుజ్ ప్రావిన్స్ చెక్‌పోస్టు వద్ద నిన్న అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. ఆఫ్ఘన్ లోకల్ పోలీస్ (ఏఎల్పీ) దళాలకు చెందిన ఓ అధికారి తన సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీస్ దళాలకు చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వారి మృతదేహాలను దహనం చేసిన ఆ వ్యక్తి.. అక్కడి ఆయుధాలు, వస్తువులను తీసుకొని తాలిబన్లలో చేరేందుకు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఆఫ్ఘనిస్థాన్ దక్షిణ హెల్మండ్ ప్రావిన్స్ వద్ద ఒక సైనికుడు కాల్పులకు పాల్పడి ముగ్గురు అమెరికా సైనిక సిబ్బందిని గాయపర్చిన ఘటన మరవక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.