: యూపీ సీఎం అవుతానని యోగి ఆదిత్యనాథ్ కు ముందే తెలుసా?
యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కబేళాలను మూయించేస్తానని యోగి ఆదిత్యనాథ్ నాడే చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం కాక ముందు ‘చల్తే చల్తే’ అనే ఓ టీవీ కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అన్ని కబేళాలను మూయించేస్తామని, పోలీసులతో ‘యాంటీ రోమియో దళాలు’ను ఏర్పాటు చేస్తామని నాటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యూపీలో బీజేపీ భారీ విజయం సాధించడం, యోగి ఆదిత్య నాథ్ సీఎం కావడంతో నాడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తాను సీఎంను అవుతాననే విషయం ఆదిత్యనాథ్ కు ముందే తెలుసని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.