: రేవంత్ ను అడ్డుకున్న పోలీసులు... ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
అసెంబ్లీ ఆవరణలో టీడీపీ నేత రేవంత్ రెడ్డికి పరాభవం ఎదురైంది. స్పీకర్ మధుసూదనాచారిని కలిసేందుకు వెళ్లిన రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ లాబీలోకి వెళ్లకుండా ఆయనను నిలిపివేశారు. దీంతో, అక్కడే ఉన్న బీజేపీ నేత కిషన్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏమైనా నేరస్తుడా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారా? అని మండిపడ్డారు. అయితే, చీఫ్ మార్షల్ ఆదేశానుసారమే తాము రేవంత్ ను అడ్డుకున్నామని సిబ్బంది తెలిపారు. ఇదే సందర్భంలో రేవంత్ మాట్లాడుతూ, తనను సస్పెండ్ చేసినట్టు మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా? అని నిలదీశారు.