: ఎమ్మెల్యే ఎస్కార్ట్ పై ఉగ్రవాదుల కాల్పులు


జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఉదయం అనంతనాగ్ నుంచి షోపైన్ కు ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్ వెళుతుండగా... ఆయన ఎస్కార్ట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, ఎమ్మెల్యే ఉన్న వాహనం బుల్లట్ ప్రూఫ్ కావడంతో, ఆయనకు ఏమీ కాలేదు. పోలీసులు కూడా ఉగ్రవాదుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అయితే, ఎస్కార్ట్ లోని వాహనాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి.

  • Loading...

More Telugu News