: జాఫ్నాలో తమిళులకు కొత్త ఇళ్ల తాళాలను అందజేయనున్న రజనీకాంత్.. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగం!


లైకా గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్ కరన్‌ అల్లిరాజా తల్లి పేరిట ఏర్పాటు చేసిన జ్ఞానం ఫౌండేషన్.. శ్రీ‌లంకలోని జాఫ్నాలో తమిళ నిర్వాసితుల కోసం ఇళ్లు నిర్మించింది. ఈ ఇళ్ల‌ను వారికి సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చేతుల మీదుగా అందజేయ‌నున్న‌ట్లు జ్ఞానం ఫౌండేష‌న్ ప్ర‌క‌టించింది. వాటికి సంబంధించిన తాళాల‌ను ర‌జ‌నీ వ‌చ్చేనెల ఏప్రిల్‌ 9న ల‌బ్ధిదారుల‌కు అందిస్తార‌ని తెలిపింది. రూ.22 కోట్ల ఖర్చుతో ఏడాదిన్నర కాలంలో మొత్తం 150 ఇళ్లను నిర్మించామని తెలిపింది. ఈ సంద‌ర్భంగా జాఫ్నాలో ఏర్పాటు చేసే ఒక బహిరంగ సభలోనూ రజనీకాంత్ మాట్లాడ‌తార‌ని సంస్థ తెలిపింది. ఆ ప్రాంతంలో మొక్కలు నాటే కార్య‌క్ర‌మంలోనూ ర‌జ‌నీ పాల్గొన‌నున్న‌ట్లు చెప్పింది.

  • Loading...

More Telugu News