: 'కాటమరాయుడు' సినిమాపై రివ్యూ, రేటింగ్ ప్రకటించిన సెన్సార్ బోర్డు సభ్యుడు


రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' రివ్యూను, రేటింగ్ ను యూకే, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ సినిమాల్లో 'వన్ ఆఫ్ ది బెస్ట్' గా నిలుస్తుందని 5కు గాను 4 పాయింట్ల రేటింగ్ ను ఇస్తున్నానని తెలిపారు. తనదే మొదటి రివ్యూఅని, సినిమా సూపర్ హిట్టని చెబుతూ, శ్రుతిహాసన్ తో పవన్ కెమిస్ట్రీ బాగుందని, పాటలు, ఫైట్స్ అద్భుతమని చెప్పుకొచ్చారు. కథా పరంగా కొత్తదనం లేకున్నా, దర్శకుడు తన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడని చెబుతూ, సినిమా విడుదలకు ముందే పవన్ అభిమానులకు శుభవార్త చెప్పేశారు.

  • Loading...

More Telugu News