: అప్పుడేమో రెండు కళ్ల సిద్ధాంతం.. ఇప్పుడేమో అయిపోయిన అంశం అంటున్నారు: రోజా


సమైక్యాంధ్ర  ఉద్యమం జరిగినప్పుడు రెండు కళ్ల సిద్ధాంతం గురించి చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే అది అయిపోయిన అంశం అని చెబుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చించడం కోసం ఎన్నో వాయిదా తీర్మానాలు ఇస్తున్నప్పటికీ, చర్చకు మాత్రం వాటిని స్వీకరించడం లేదని చెప్పారు. ఎన్నో ముఖ్యమైన సమస్యలపై చర్చించకుండా సభను వాయిదా వేస్తున్నారని... కాల్వ శ్రీనివాసులు ఇచ్చిన సిగ్నల్ ఆధారంగా నిన్న సభను స్పీకర్ వాయిదా వేశారని... ఇది స్పీకర్ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న చాలా మంది కుమ్మక్కై అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులను వేలం వేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులు హైకోర్టుకు వెళ్లేంతవరకు కూడా ప్రభుత్వం ఈ సమస్య వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ను చంద్రబాబే కాపాడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News