: విజయకాంత్ కు అస్వస్థత.. వివరాలను ఇంకా వెల్లడించని డాక్టర్లు


డీఎండీకే అధినేత, ప్రముఖ సినీనటుడు విజయ్ కాంత్ అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం బయటకు రావడం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని డీఎండీకే నేతలు చెబుతున్నారు. అయితే, ఏ కారణంతో ఆయన ఆసుపత్రిలో చేరారన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించడం లేదు.

రెగ్యులర్ వైద్య చికిత్సల కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేతలు చెబుతున్నారు. అయితే, ఈ మాటలను కార్యకర్తలు నమ్మడం లేదు. సాధారణ వైద్య చికిత్సల కోసం ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, డీఎండీకే కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News