: చెప్పాపెట్టకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆశ్చర్యపరిచిన యూపీ సీఎం ఆదిత్యనాథ్


యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళుతున్న యోగి ఆదిత్యనాథ్, లక్నోలో నిత్యమూ బిజీగా ఉండే హజ్రత్ గంజ్ పోలీసులను ఆశ్చర్యపరుస్తూ, ఎవరికీ చెప్పాపెట్టకుండా ఈ ఉదయం తనిఖీకి వెళ్లారు. అక్కడి రికార్డులు, నేరస్తులను ఉంచే గదులు, వాటిల్లోని సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న నేరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆకస్మిక తనిఖీతో పోలీసు వర్గాల్లో ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలిగినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేస్తామని, అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన, మహిళల భద్రత కోసం యాంటీ రోమియో స్క్వాడ్స్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News