: అన్నాడీఎంకే పేరును మార్చుకున్న శశికళ వర్గం!
త్వరలో జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పేరును వాడుకోరాదని, రెండాకుల గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ స్పష్టం చేయడంతో కొత్త పార్టీ పేరును శశికళ వర్గం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో 'ఏఐఏడీఎంకే అమ్మ' పేరు మీదట పోటీ చేస్తామని, తమకు ఆటో, క్యాబ్, బ్యాట్ లలో ఏదో ఒక గుర్తును ఇవ్వాలని కోరింది. ఇప్పటికే 'అమ్మ ఏఐఏడీఎంకే' పేరుపై పన్నీర్ సెల్వం ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మధుసూదనన్ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలకు చెందిన అభ్యర్థులతో పాటు, డీఎంకే, దీప కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోటీ తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.