: ప్రత్యేక హోదా రాదు, ఇక మాట్లాడేది లేదు: కుండబద్దలు కొట్టిన యనమల


రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఈ ఉదయం నుంచి వైకాపా ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టి డిమాండ్ చేస్తున్న వేళ, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. హోదాపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని అన్నారు. హోదాతో పొందే లాభాలకన్నా ఎక్కువ ప్రతిఫలం ప్యాకేజీతో దక్కనుందని, విపక్షాలు రాజకీయం చేయడం కోసమే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయని ఆరోపించారు. హోదా కోసం చర్చ అనవసరమని, ఈ అంశంపై మాట్లాడేందుకు ఏమీ లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని కేంద్రం తేల్చి చెప్పిందని, అందువల్లే అంతకు మించిన సహాయాన్ని పొందేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News