: బాలయ్య అభిమానులకు పండగే: పూరి జగన్నాథ్ ట్వీట్


100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో ఘన విజయాన్ని సాధించిన నందమూరి బాలకష్ణ... తన 101వ చిత్రాన్ని డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలసి చేస్తున్నారు. ఈ మధ్యనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లిన ఈ సినిమా... శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అతి తక్కువ వ్యవధిలోనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అది కూడా ఏదో డైలాగ్ సీన్లు కాదు... ఓ భారీ యాక్షన్ సీన్ ను పూర్తి చేసుకుందట. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎన్ బీకే 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని... భారీ సెట్ లో యాక్షన్ సీన్లు పూర్తి చేశామని తెలిపాడు. ఈ సీన్లు బ్రహ్మాండంగా ఉంటాయని... బాలయ్య అభిమానులకు పండగేనని చెప్పాడు.

  • Loading...

More Telugu News