: కుమారుడికి అభిమాన దర్శకుడి పేరు పెట్టుకున్న 'కాలకేయ'
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకూ చాటిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాలో బాహుబలి, భల్లాలదేవలతో సమానంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో పాత్ర కాలకేయ. వికృత రూపంతో, అర్థంకాని భాషతో కాలకేయ పాత్రలో ఒదిగిపోయాడు నటుడు ప్రభాకర్. ఈ పాత్ర నటుడిగా ప్రభాకర్ కు ఎంతో పేరుతో పాటు, పలు సినీ అవకాశాలను కూడా తీసుకొచ్చింది. అంతకు ముందు రాజమౌళి నిర్మించిన మగధీర, మర్యాదరామన్న సినిమాల్లో కూడా ప్రభాకర్ నటించాడు. తన కెరియర్ కు ఎంతో ఊతమిచ్చిన దర్శకుడు రాజమౌళి అంటే ప్రభాకర్ కు చాలా గౌరవం, అభిమానం. అందుకే తన పెద్ద కుమారుడికి శ్రీరామ రాజమౌళి అనే పేరు పెట్టుకున్నాడు. తనకు సినీ జీవితాన్నిచ్చిన రాజమౌళి పేరు కలసివచ్చేలా పేరు పెట్టుకున్నానని ప్రభాకర్ చెప్పాడు.