: జగన్ కు హైడ్రోఫోబియా, మనీ మేనియా!: టీడీపీ ఎమ్మెల్యే జవహర్


ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌‌‌ మోహన్ రెడ్డికి హైడ్రోఫోబియా, మనీ మేనియా వ్యాధులు ఉన్నాయని కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ విమర్శించారు. ఈ ఉదయం అసెంబ్లీలో వైకాపా సభ్యులు ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని నిరసనలు తెలియజేస్తున్న వేళ, జవహర్ మాట్లాడారు. పోలవరం గురించి మాట్లాడదామంటేనే జగన్ కు భయం పట్టుకుందని, ఆయన చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. జగన్ కు జలం బదులుగా ధనం కనిపిస్తోందని ఆరోపించిన ఆయన, జల సంరక్షణ ప్రతిజ్ఞలో ఎందుకు పాల్గొనలేదో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News