: ఆర్కే నగర్ ఉపఎన్నికలో మద్దతుపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్!
జయలలిత మరణంతో చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఉపఎన్నికలో అన్నాడీఎంకే తరపున శశికళ బంధువు దినకరన్, పన్నీర్ సెల్వం వర్గం తరపున మధుసూదనన్, జయ మేనకోడలు దీపలతో పాటు డీఎంకే కూడా బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్ రజనీకాంత్ ను కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని రజనీని అభ్యర్థించారు. వీరిద్దరూ కలసిన ఫొటోలు మీడియాలో రావడంతో, అమరన్ కు రజనీ మద్దతు ఇస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. దీంతో, రజనీ స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలో తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.