: బాలూ, ఇళయరాజాలను కలుపుతున్నాం!: హీరో విశాల్
తాను స్వరపరిచిన సినిమా పాటలను గాయక దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడటానికి వీల్లేదని సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, వీరిద్దరి మధ్యా ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ రంగంలోకి దిగారు. వీరిద్దరినీ ఒకే వేదికపై కలపనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఎస్పీబీ అమెరికాలో కచేరీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాగానే, తమిళ సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు సన్మాన సభను నిర్వహించనున్నామని, ఇందులో బాలూ స్వయంగా కచేరీ చేస్తారని తెలిపారు. వీరిద్దరితో ఇప్పటికే ఈ విషయమై మాట్లాడామని అన్నారు. నిర్మాతల సంఘం ఎన్నికలు ముగిసిన తరువాత ఈ సన్మాన కార్యక్రమం ఉంటుందని అన్నారు.