: లండన్ దాడిలో భారతీయులెవరూ గాయపడలేదు: సుష్మా స్వరాజ్ ట్వీట్
బ్రిటన్ పార్లమెంటు లక్ష్యంగా గత రాత్రి జరిగిన ఉగ్రదాడిలో భారతీయలెవరూ గాయపడలేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఉగ్రదాడిపై స్పందించిన సుస్మా స్వరాజ్... లండన్ ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. లండన్ లోని భారత హైకమిషన్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. లండన్ దాడుల్లో భారతీయులు ఎవరూ గాయపడలేదని ఇప్పటివరకు అందిన నివేదికలను బట్టి తెలుస్తోందని ఆమె ట్వీట్ చేశారు. కాగా, ప్రశాంతంగా ఉన్న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ పై పాదచారులపైకి కారుతో దూసుకెళ్లిన ఉగ్రవాది పార్లమెంటు భవనంలోకి చొరబడే ప్రయత్నం చేసి, భద్రతాధికారిని హతమార్చి, భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే.