: ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ... హోరెత్తుతున్న 'ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు' నినాదాలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్వచ్ఛన్ అవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాయిదా తీర్మానం ప్రారంభించాలని కోరగా, పోలవరం ప్రాజక్టు కుడికాలువకు సంబంధించిన పనులపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటన చేసేందుకు సిద్ధం కాగా, పోడియం వద్దకు దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 'ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు' అంటూ నినాదాలతో హోరెత్తించారు.