: ఉగ్రవాద సంబంధిత సమాచారం ఉన్న 6 లక్షల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్


ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంబంధిత సమాచారం ఉన్న లక్షలాది ట్విట్టర్ అకౌంట్లను స్తంభింపజేసింది. ట్విట్టర్ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం గత ఏడాదిన్నర కాలంలో సుమారు 6,36,248 ట్విట్టర్ ఖాతాలపై వేటు వేసినట్టు తెలిపింది. ఈ మొత్తం అకౌంట్లలో గత ఏడాది ద్వితీయార్థంలోనే 3.76,890 అకౌంట్లను స్తంభింపజేసినట్టు ట్విట్టర్ ఈ నివేదికలో పేర్కొంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ తో సంబంధాలు కలిగి ఉన్న 1,25,000 అకౌంట్లను బ్లాక్ చేసినట్టు ట్విట్టర్ గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మరింత నిఘా పెంచిన ట్విట్టర్ మొత్తం 6,36,248 అకౌంట్లను స్తంభింపజేసినట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News