: మాపై వివక్ష విడనాడండి... ఐసీసీని హెచ్చరించిన బీసీసీఐ!
బీసీసీఐలో సంస్కరణలు చేపడుతూ సుప్రీంకోర్టుచే నియమింపబడిన వినోద్ రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పాలక మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ను బీసీసీపై వివక్ష చూపించవద్దని హెచ్చరించింది. బీసీసీఐకి నష్టం కలిగే విధంగా ఉండే ఐసీసీ నిర్ణయాలను ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇంతవరకు అమలులో ఉన్న ఆర్థిక విధానం స్థానంలో ఐసీసీ ప్రతిపాదించిన కొత్త ఆర్థిక పద్ధతిని అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.
ఐసీసీ ప్రతిపాదిస్తున్న కొత్త విధానాన్ని అంగీకరించాలంటే సవరణలు చేయాలని స్పష్టం చేసింది. ఐసీసీకి ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్న భారత్ కు ఎక్కువ నిధులు సమకూర్చాలని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. వివక్షాపూరిత విధానాలను ఐసీసీ విడనాడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో మద్దతు దేశాలతో ఐసీసీపై ఒత్తిడి తెచ్చి బీసీసీఐ ప్రాభవానికి గండికొట్టే ప్రయత్నం చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా, బ్రిటన్ క్రికెట్ కౌన్సిల్ ల ఎత్తులకు బీసీసీఐ చెక్ చెప్పినట్టయింది.