: ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారు...బెల్జియం పయనానికి సిద్ధం
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 25 నుంచి నాటో దేశాల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయన తొలి విదేశీ పర్యటన ఖరారు చేశారు. దీంతో ఆయన తొలి విదేశీ పర్యటన బెల్జియంలో జరగనుంది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఏప్రిల్ 25 నుంచి నాటో దేశాల సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సులో పాల్గొని నాటోతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం, కూటమికి సంబంధించి కీలక అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై చర్యలను ట్రంప్ చర్చిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్ జీ–20 సదస్సు కోసం జర్మనీ వెళతారు. ఈ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు. అధ్యక్షుడైన అనంతరం భారత్ తమకు సన్నిహిత దేశమంటూ మోదీని శ్వేతసౌధానికి ఆహ్వానించగా, ట్రంప్ ను భారత పర్యటనకు మోదీ ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో మోదీ, ట్రంప్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.