: జంతువులపై ఎనలేని ప్రేమ చూపించే యూపీ సీఎం!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు జంతువులు అంటే చాలా ఇష్టం. అందుకే, వాటిపై ఆయన చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఇందుకు నిదర్శనం ఎన్నో సంఘటనలు ఉన్నాయి. గోరఖ్ నాథ్ ఆలయ పరిసరాల్లో ఉండే కోతులు, పిల్లులు, కుక్కలు తదితర జంతువుల కోసం ఆయన ప్రత్యేకంగా టైమ్ కేటాయించే వారు. వాటికి ఆహారం కూడా పెడుతుంటారు. మరో సంఘటన.. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఓ చిరుత పిల్ల అరుస్తూ ఆయన కంట పడింది. దానిని తులసిపూర్ లోని ఆశ్రమానికి తరలించి.. కొన్ని నెలల పాటు ఇక్కడే ఉంచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆదిత్య నాథ్ ట్విట్టర్ ఖాతాలో దర్శనమిస్తుంటాయి. అంతే కాకుండా, ఈ తరహా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోను నెటిజన్లు పోస్ట్ చేస్తుండటం గమనార్హం. కాగా, యూపీలో గోవుల అక్రమ రవాణా, కబేళాలపై సీఎం హోదాలో ఆయన నిషేధం ప్రకటించడం విదితమే.